Home  »  TV News  »  అభిజిత్... షాలిని మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్... ఐ లవ్ యు చెప్పిన షాలిని

Updated : Aug 15, 2026

షాలిని దామెర బిగ్ బాస్ అగ్నిపరీక్షలా ఫస్ట్ కంటెస్టెంట్ గా వచ్చింది. రాగానే అభిజీత్ ని ఫ్లర్ట్ చేసింది. ఇక శ్రీముఖి కూడా అదే విషయాన్నీ అడిగింది. అందరికీ గారు అని పెట్టి అభిజిత్ అన్నావన్నమాట అంది. "అంటే ఇప్పుడు చెప్పడం కంటే ఆడిషన్ అంతా ఐపోయాక చెప్పడం బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట " అంది షాలిని. ఆ మాటలకూ సంథింగ్  సంథింగ్ అని శ్రీముఖి అనేసరికి అభిజిత్ ముఖం మీద చిన్న చిరునవ్వు కనిపించింది. ఐతే తానూ కరీంనగర్ నుంచి వచ్చినట్లు లాస్ట్ ఏడేళ్ల నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నట్లు చెప్పింది. నవదీప్ ఐతే ఆమె ఇంట్రడక్షన్ ని ఏదైనా సాంగ్ కి డాన్స్ చేస్తూ చెప్పమని ఆల్రెడీ టాస్క్ ఇచ్చాడు. అలాగే చేసింది షాలిని.

ఇక నవదీప్ మరో టాస్క్ ఇచ్చాడు. ఫోన్ పగలగొట్టమన్నాడు అది పగలగొట్టింది. కానీ ఒక్కసారికి పగలకపోయేసరికి శ్రీముఖి దాన్ని పిప్పి పిప్పి చేసింది. తర్వాత మురికి పట్టిన షూస్ క్లీన్ చేయమన్నారు. కానీ మొదట చేయని అని చెప్పింది. కానీ ఆ తర్వాత కూర్చుని చేసింది. ఐతే షూస్ ని వాటర్ లో డిప్ చేసేసరికి బిందు మాధవికి కోపం వచ్చేసింది. అలా వాటర్ లో డిప్ చేయరు అంటూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. ఇక అభిజిత్ ఆ పని అక్కడితో ఆపేసి స్టేజి మీదకు రమ్మన్నాడు. "నువ్వు స్టాండ్ తీసుకుని షూస్ క్లీన్ చేసావ్. ఫైన్. ఏ పనైనా చిన్నది, పెద్దది అని కాదు. ఇంట్లో నా షూస్ ని నేనే క్లీన్ చేసుకుని రావాలి. వేరేలా అనుకోకు. చాల బాగా ఆడావ్. నేను నీకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చావ్. " ఇక నవదీప్ ఐతే ఇప్పుడు చెప్పు అన్నాడు. "ఎలాగైనా అభిజిత్ గారితో ఇంప్రెస్ చేయించుకోవాలని పట్టుదలతో వచ్చాను. అతనంటే నాకు చాల ఇష్టం ఎందుకంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటె ఎవ్వరినైనా ఓడించొచ్చు అని చెప్పారు. ఆయన నుంచి నాకు గ్రీన్ ఫ్లాగ్ రావడం నాకు చాలా స్పెషల్. "మీరు ఎందుకు ఇన్స్పిరేషనో మళ్ళీ ప్రూవ్ చేశారు . నేను స్టేజి మీదకు వచ్చినప్పుడు కూడా నేను షివర్ అవ్వలేదు. కానీ ఆయన హగ్ ఇచ్చినప్పుడు అంతే "    అని ఏడుస్తూనే చెప్పింది.

ఇక ఆయన నా బంగారం అన్నట్టు అభిజిత్ నోటికలు విరిచాడు. షాలిని కూడా అలాగే చేసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఇక శ్రీముఖి ఐతే "నాకెందుకో నువ్వు మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చినట్టు అనిపించలేదు వెళ్ళు " అనేసరికి షాలిని పరుగున వచ్చి అభిజిత్ ని హగ్ చేసుకుంది. అభిజిత్ కూడా లేచి హగ్ చేసుకున్నాడు. " ఐ లవ్ యు డార్లింగ్ " అని చెప్పింది.  తర్వాత నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. బిందు మాధవి రెడ్ ఇచ్చేసరికి నేను రెడ్ ని నేనెప్పుడూ తప్పుగా తీసుకోలేదు అని ఆమెకు హగ్ ఇచ్చి మరీ చెప్పింది. ఇక నవదీప్ ఆమె సెల్ ని ఆమెకిచ్చాడు. దాంతో షాలిని ముఖంలో వెలుగు కనిపించింది. ఐపోయింది అనుకున్నా మళ్ళీ ఇప్పుడు లక్షన్నర ఎక్కడ నుండి తేవాలి అనుకున్నా. నిజానికి ఒకటి చెప్పాలి. దీనికి యాపిల్ కవర్ ఉంది " అని చెప్పేసింది. అంతే నవదీప్ " అమ్మా నాగార్జున గారు వాళ్ళు ఫోన్ ఇన్సూరెన్స్ తో వచ్చారండి ఏంటిది నీ ఫోన్ ఏమీ పగలకొట్టలేదు అర్థమైంది కదా " అన్నాడు . ఇక శ్రీముఖి ఐతే "నేను ఓపెన్ గా అడిగేస్తున్నా. పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకుంటావా " అని అడిగింది.

"ఎవరు చేసుకోరండి " అని చెప్పేసరికి అభిజిత్ ఎప్పుడూ లేని తెల్ల కాగితాన్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుని సిగ్గుపడ్డాడు. "బిందు బిందు అగ్ని పరీక్ష సీజన్లో 2 అంతా వాళ్ళను ఎలా కలపాలి అన్న ప్రయత్నంలో మనం ఉందాం " అని చెప్పింది. "నేను అబ్బాయి సైడ్ నుంచి నువ్వు అమ్మాయి సైడ్ నుంచి " అని చెప్పింది బిందు మాధవి. "నేను ముహూర్తాలు పెడతాను " అన్నాడు నవదీప్. "అంటే అన్నారు కానీ ఆ మాట " అంటూ షాలిని సిగ్గుపడింది. "మరి అభిజిత్ కి స్నాప్ చాట్ చూపిస్తావా " అన్నాడు నవదీప్. "అవును చూపిస్తా నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. ఆయన మీద నాకు క్రష్ ఉంది " అని చెప్పింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.